in ,

Kakinada Smart City works gain momentum with Rs. 300 crores, after municipal polls

KSCCL Official -Kakinada Smart City
Image Credits: KSCCL Official

కాకినాడ స్మార్ట్ సిటీ కార్యక్రమానికి సంబంధించిన పనులు ఊపందుకున్నాయి, ఫిబ్రవరి నుంచి ప్రజలకు సేవలను అందించడానికి వేగవంతమైన డిజిటల్ ప్రాజెక్టుకు సంబందించిన పనులు వేగంగా జరుగుతున్నాయి.

2016, జనవరిలో చోటు పొందిన తొలి 20 ‘స్మార్ట్’ నగరాలలో మన కాకినాడ ఉన్న విషయం తెల్సిందే, అయితే వీధి విక్రయదారులకు తోపుడు బళ్ళు పంపిణి వంటి పనులు మరియు ఎంచుకున్న నివాస ప్రాంతాలలో పైపుతో కూడిన వంటగ్యాస్ సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేయటం తప్ప చాలా వరకు పనులు మొదలవలేదు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంతర పర్యవేక్షణ తరువాత, రూ. 300 కోట్లు విడుదల చేశాయి, ప్రస్తుతం 240 కోట్లు బిడ్డింగ్ దశలో ఉన్నాయి. “6.2 కిలోమీటర్ల మేరకు కోర్ మార్గంలో ఆప్టికల్ ఫైబర్ విస్తరణ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ఇప్పుడు క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలకు (C.C Cameras). Wi-Fi కోసం స్మార్ట్ స్ట్రీట్ లైట్లను మరియు యాక్సెస్ పాయింట్లను వేసె పనులు యెరుగుతున్నట్టు కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎస్ అలీమ్ బాషా తెలిపారు.

స్మార్ట్ సిటీ సంబంధిత ICT పరిష్కారాలలో ముఖ్యమైన అంశాలు: కమాండ్ కంట్రోల్ సెంటర్, CCTV నిఘా, Wi-Fi, వాహనాల ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ గుర్తింపు, పేస్ డిటెక్షన్ మరియు వేస్ట్ & డిసాస్టర్ మానేజ్మెంట్.

Various Infrastructure projects under Smart City Mission:

ప్రస్తుతం పూర్తిస్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం దాదాపుగా ఐపోవచ్చింది మరియు మునిసిపల్ పాఠశాలలలొ ఇంటర్నెట్ ఆధారిత స్మార్ట్ తరగతి గదుల పనులు కూడా అవుతున్నాయి. “ICT” – సంబంధ సేవలతో పాటు, స్మార్ట్ సిటీ మిషన్ పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేసే పనులు కూడా ఊపు అందుకుంటున్నాయి. మార్కెట్ ప్రాంతాలను అభివృద్ధి చేయడం, వంతెనలను విస్తరించడం మరియు పార్కుల అభివృద్ధి తదితర అంశాలు ముఖ్యమైనవి.

మన కాకినాడలొ ప్రతిరోజూ 220 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్నాది, రోజు ఆ చెత్త బుట్టలను తొలగించడం పారిశుద్ధ్య సిబ్బందికి ప్రధాన సవాలు. దీనిని అధిగమించడానికి రూ. 94 కోట్లతో మున్సిపల్ యంత్రాంగం ఇప్పుడు సెన్సార్ ఆధారిత డంపర్ బిన్స్ ని అందుబాటులోకి తెస్తున్నారు, కాబట్టి ఒక బిన్ నిండిన వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్ కి తక్షణం సమాచారం వెళ్తుంది. “అదేవిధంగా, నగర పర్యవేక్షణ బాగా అభివృద్ధి, సి.సి. కెమెరాలు మరియు నంబర్ ప్లేట్ రీడింగ్ సిస్టమ్, రహదారులపై ప్రజా భద్రతను మెరుగుపరుస్తాయి, ఆటోమేటెడ్ సిగ్నల్ లైటింగ్ వ్యవస్థ రహదారిపై వాహన రద్దీని తగ్గిస్తుంది” అని మున్సిపల్ కమిషనర్ బాషా తెలిపారు.

Written by Admin

Comments

SRMT Mall Kakinada

SRMT Mall Kakinada- Full Details, Pictures, Address Everything you need to know.

Is there a solution for the Cow Menace on our Kakinada roads?